: విడిపోయిన మహిళల డబుల్స్ ‘విన్నింగ్’ జోడీ!... కొత్త భాగస్వామిని ఎంచుకున్న సానియా!


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... వరల్డ్ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జత కట్టి సంచలన విజయాలను నమోదు చేసింది. వరుస విజయాలతో ఈ జోడీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే గడచిన ఐదు నెలల సమయంలో ఈ జోడీ మునుపటి ప్రదర్శనను కనబరచడంలో ఘోరంగా విఫలమైంది. దీని ఫలితంగా విన్నింగ్ జోడీగా పేరుపడ్డ వీరిద్దరూ ఇకపై వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగనున్నారు. రానున్న సిన్సినాటి టోర్నమెంట్ నుంచే వీరిద్దరూ కొత్త భాగస్వాములతో రంగంలోకి దిగుతారట. బార్బోరా స్ట్రికోవాతో సానియా జట్టు కడుతుండగా, కోకో వాండవెఘేతో కలిసి హింగిస్ బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News