: వైఎస్ జగన్ కు ఝలక్!... అపాయింట్ మెంట్ కు రాజ్ నాథ్, జైట్లీ ససేమిరా!
ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా హస్తినలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలిరోజుననే రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన జగన్ కు గట్టి దెబ్బే తగిలింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మంచిగా పనిచేస్తున్నారని సాక్షాత్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే కితాబివ్వడంతో జగన్ కు నోట మాట రాలేదు. తాజాగా నిన్న ఆయనకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు కూడా ఝలక్కిచ్చారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ కోసం జగన్ అపాయింట్ మెంట్ కోరగా, అక్కడి నుంచి అసలు స్పందనే రాలేదట. జగన్ తో భేటీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ససేమిరా అన్నట్టు సమాచారం.