: అసదుద్దీన్ ఒవైసీకి మహారాష్ట్ర నుంచి శుభవార్త!
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఈరోజు శుభవార్త అందింది. ఇక ఆయన పార్టీ మహారాష్ట్రలో పార్టీ పేరు, గుర్తుతో సహా పోటీ చేయొచ్చు. ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించారు. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పేరు, గుర్తుతో ఆయన పార్టీ ఎన్నికల బరిలో దిగొచ్చు. వచ్చే ఏడాది నిర్వహించనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంఎస్) ఎన్నికలకు ఎంఐఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడంతో ఎంఐఎం పార్టీ శ్రేణుల్లో ఆనందం మిన్నంటింది.