: ఆ గ్రామంలోని అన్ని కుటుంబాలకు రూ.5 వేల చొప్పున జరిమానా విధించిన అధికారులు!
చేసిన తప్పుకి గానూ గ్రామంలో ఏదో ఓ కుటుంబానికో, లేక ఓ వ్యక్తికో జరిమానా విధించిన సంఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే, బీహార్ నలంద జిల్లాలోని కైలాస్‌పురి గ్రామంలో నివాసముంటున్న అన్ని కుటుంబాలపై జిల్లా అధికారులు జరిమానా విధించారు. బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సహించే వారిపై నితీశ్ సర్కారు కఠిన చర్యలే తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన సొంత జిల్లా అయిన నలందలోని కైలాస్‌పురి గ్రామంలో మద్య నిషేధచట్టాన్ని ప్రజలు ఉల్లంఘించారు. పలుసార్లు అధికారులు వారి చర్యల పట్ల హెచ్చరించారు. అయినా గ్రామస్థులు వినలేదు. దీంతో అధికారులు ఇక లాభం లేదని ఆ గ్రామంలో నివసించే అన్ని కుటుంబాలకు జరిమానా విధించారు. అపరాధ రుసుముగా ఆ గ్రామంలో ఉన్న మొత్తం 50 కుటుంబాలు రూ. 5వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు.