: జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి: నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి జీవో 123ని రద్దు చేసి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారమివ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రేపు నిరశనకు దిగనున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆయనపై నిప్పులు చెరిగారు. టీఎంయూ విజయోత్సవ సభలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ.. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని అన్నారు. తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్టులని ఆపేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సీఎం కావడం కార్మికుల అదృష్టమని హరీశ్‌రావు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. ఆర్టీసీని అప్పుల నుంచి బయటపడేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కార్మికులకు ఇళ్లస్థలాలు ఇస్తామని అన్నారు.