: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. విజయదశమి నుంచే ఏర్పాటు?
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని చూస్తోన్న కేసీఆర్ సర్కార్ ఈ అంశంలో ఇప్పటికే మంత్రులు, అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న సంగతి తెలిసిందే. సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ నేతృత్వంలో ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమవుతోంది. ఈ అంశంపై కేసీఆర్ ఈరోజు హైదరాబాద్‌లో అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్పై ఆయన చర్చించారు. త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేసి, ఆ తరువాత ప్రభుత్వం వాటిపై వచ్చే అభ్యంతరాల సేకరణకు 30 రోజులు గడువు ఇవ్వనుంది. వచ్చే విజయదశమి రోజునే కొత్త జిల్లాల ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.