: కడియం శ్రీహరి వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. నిరసన ర్యాలీ
తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిన్న ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో మార్పు రాకపోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని అన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలు ఫైళ్లను చేతిలో పట్టుకొని తిరగడం మాని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి మాత్రమే కృషి చేయాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. కడియం వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు నిరసన తెలిపాయి. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్‌లో ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీశాయి. కడియం తన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.