: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు మధ్యాహ్నం అక్కడి సమీపంలోని బంగారం ఆభరణాల తయారీ దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు సిబ్బందిని తమతో తెచ్చుకున్న కత్తులతో బెదిరించారు. దుకాణం నుంచి 9 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దోపిడీలో ఆరుగురు దుండగులు పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. దోపిడీపై దుకాణం యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ చేసిన ముఠా గురించి ఆరా తీశారు. వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.