: రాష్ట్ర విభజన పాపం జగన్‌దే.. సీఎం కావాలని చేసిన ప్రయత్నమే కారణం: ఎంపీ టీజీ వెంకటేశ్
రాష్ట్ర విభజన పాపం వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిదేనని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూశారని ఆయన అన్నారు. ఆ భయంతోనే తెలంగాణలో తమ పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని వ్యాఖ్యానించారు. హోదా అనే అంశాన్ని పట్టుకొని జగన్మోహన్‌రెడ్డి రాజకీయం చేయడం సరికాదని వెంకటేశ్ అన్నారు. టీడీపీ హోదా కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. హోదా గురించి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయాలని ఆయన అన్నారు.