: ఆజాద్ ఉపయోగించిన పిస్టల్ తో సెల్ఫీ దిగొచ్చు, వీడియో తీసుకోవచ్చు!


స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉపయోగించిన పిస్టల్ తో సెల్ఫీ తీసుకునేందుకు విజిటర్లకు అలహాబాద్ మ్యూజియం అనుమతినిచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీ సాంస్కృతిక సంక్షేమ శాఖ ఈ అవకాశం ప్రజలకు కల్పించింది. ఈ మేరకు మ్యూజియం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మ్యూజియం డైరెక్టర్ మాట్లాడుతూ, పిస్టల్ తో సెల్ఫీ దిగితే రూ.50, వీడియోకు రూ.1000 చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ భౌతికకాయాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు ఉపయోగించిన వాహనంతో కూడా సెల్ఫీలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, 1931 ఫిబ్రవరి 27వ తేదీన బ్రిటిష్ పోలీసులతో ఆల్ఫ్రెడ్ పార్కులో ఎదురు కాల్పులు జరిగిన సమయంలో ఆజాద్ ను పట్టుకోవాలని ప్రయత్నించిన సందర్భంలో తనను తాను ఈ పిస్టల్ తోనే ఆయన కాల్చేసుకున్నారు. 1903 కోల్ట్ మోడల్ కు చెందిన ఈ పిస్టల్ ను పాకెట్ హ్యమర్ లెస్ సెమీ-ఆటో టెక్నాలజీతో తయారు చేశారు.

  • Loading...

More Telugu News