: ‘లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై నీట్ ర‌ద్దు పిటిష‌న్‌’ను కొట్టివేసిన సుప్రీంకోర్టు


ప్రైవేటు మెడికల్ మేనేజ్‌మెంట్ కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-2)ను రద్దు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌ ఈరోజు తిర‌స్క‌రణకు గురయింది. నీట్-2 ప్రశ్నపత్రం లీకైందని అన్షుల్ శర్మ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టుకు ప్రశ్నపత్రాలు సమర్పించడంతో ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతుండ‌గా మరోవైపు దానిలో తాము క‌ల్పించుకోలేమ‌ని జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలోని బెంచ్ ఈరోజు స్పష్టం చేసింది. హల్ద్వానీ పోలీసులు ఈ అంశంపై ద‌ర్యాప్తు జరుపుతున్నారని న్యాయస్థానం గుర్తు చేసింది.

  • Loading...

More Telugu News