: గౌహతిలో తీవ్ర ఉద్రిక్తత... సీఎం ఖండూ, డిప్యూటీ చొవ్నా మేలపై దాడి!
ఆసోం మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గౌహతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన మరణ వార్తను తెలుసుకున్న అనుయాయులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి పెమా ఖండూ ఇంటిపై దాడి చేశారు. ఖండూతో పాటు ఉప ముఖ్యమంత్రి చొవ్నా మే లపై దాడి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలిఖో పుల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ రెబల్ నేతగా, పార్టీ నుంచి విడిపోయిన ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.