: స్టేజ్ పై హీరోయిన్ ను అసభ్యంగా సంబోధించి విమర్శలు కొనితెచ్చుకున్న సింగర్
తాను పాడిన పాటల పాప్యులారిటీ కన్నా, చేసిన పనులు, వివాదాస్పద వ్యాఖ్యలతో బాగా ఫేమస్ అయిన సింగర్ మికాసింగ్ మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ నటించిన చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతున్న వేళ, ఆమెను అసభ్యకరంగా సంబోధించాడు. వేదికపై ఉన్న మికా సింగ్, హీరోయిన్ ను వేదికపైకి ఆహ్వానిస్తూ, డయానా ప్యాంటీ అంటూ పిలిచాడు. ఈ పిలుపుతో అక్కడున్న ఆహూతులంతా ఒక్కసారిగా అవాక్కవగా, డయానా మనసు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ కాబట్టి, చిరునవ్వు చెరగనీయకుండా వేదిక ఎక్కింది. చూస్తున్న వారు మాత్రం మికా ప్రవర్తనపై తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట.