: నేను ఇద్దరిని వివాహమాడాను: క‌ర‌ణ్‌జొహార్


బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌ర‌ణ్‌జొహార్ త‌న‌కు ఇద్ద‌రు భార్య‌లున్నార‌ని అన్నారు. నాలుగు ప‌దుల వ‌య‌సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోని ఆయ‌న... తాను ఇద్ద‌రిని వివాహ‌మాడానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌ర‌ణ్‌జోహార్ ఇంకా ఎప్పుడు పెళ్లిచేసుకుంటాడంటూ ఎదురుచూస్తున్న త‌న అభిమానులు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఎంతో ఆస‌క్తిక‌నబ‌ర్చారు. టీవీని త‌న‌ భార్యలా చూసుకుంటానని క‌ర‌ణ్‌జోహార్ అన్నారు. తాను ఇద్దరిని వివాహ‌మాడాన‌ని, ఒకటి సినిమా కాగా మరొకటి టీవీ అని ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అందుకే త‌న‌కు ఇద్దరు భార్యలున్నారని అన్నారు. కరణ్‌ జొహార్‌ సినిమాలు త‌ప్ప వేరే ప్ర‌పంచం వైపు తొంగిచూడ‌రన్న విష‌యం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్‌ని న‌డిపిస్తూ ఎన్నో సినిమాలు తీశారు. అంతేకాదు, మ‌రోవైపు బుల్లితెరపై ‘కాఫీ విత్‌ కరణ్‌’ పోగ్రాంకి నిర్మాతగా, యాంక‌ర్‌గా ఉన్నారు. మ‌రోవైపు ‘జలక్‌ దిఖ్‌ లాజా’ (డాన్సు షో) కూడా తీస్తున్నారు. తాను బాలీవుడ్‌కి ఎంత ప్రాధాన్య‌త ఇస్తాడో బుల్లితెర షోల‌కు కూడా అంతే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఇద్ద‌రు భార్య‌లంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రతి బుధవారం టీవీ టీఆర్‌పీ గురించి త‌మ టీమ్‌తో చ‌ర్చించి తెలుసుకుంటాన‌ని క‌ర‌ణ్‌జోహార్ అన్నారు. ఒకవేళ‌ టీఆర్‌పీ త‌గ్గిన‌ట్లు తెలిస్తే అది త‌న వల్లేనని బాధపడతాన‌ని అన్నారు. ఒక‌వేళ మంచి టీఆర్‌పీ వ‌స్తోంద‌ని తెలిస్తే అదికూడా త‌న వ‌ల్లేన‌ని భావిస్తాన‌ని చెప్పారు. తాను ఏది చేసినా అది మంచి విజ‌యం సాధించాల‌ని ఆశిస్తాన‌ని, తాను టీవీని పరాయిదానిలా చూడ‌బోన‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News