: సంగారెడ్డిలో అక్రమ ఆయుధాలు!... నలుగురి అరెస్ట్!


మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో అక్రమ ఆయుధాల కలకలం రేగింది. నిన్న పాలమూరు జిల్లా షాద్ నగర్ లో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగిన మరునాడే సంగారెడ్దిలో అక్రమ ఆయుధాలు బయటపడటంతో పెను కలకలమే రేగింది. అక్రమ ఆయుధాలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సంగారెడ్డిలోని ఓ రహస్య స్థావరంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు పిస్టళ్లు, మూడు బుల్లెట్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News