: నరేంద్ర మోదీ పేరు, ఫొటోతో సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి దరఖాస్తు!


దేశంలో సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. ఈ బరితెగింపు పరాకాష్టకు నిదర్శనమే ఈ ఘటన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఆర్పీఎఫ్ జవాను పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సీఆర్పీఎఫ్ దళం తెరచిన ఓ వెబ్ సైట్ కు నరేంద్ర మోదీ దరఖాస్తు అందింది. తీరా ఆరా తీస్తే... ఈ దరఖాస్తు ఓ సైబర్ నేరగాడి పని అని తేలింది. గుర్తు తెలియని ఓ దుండగుడు సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తూ... సదరు దరఖాస్తులో అభ్యర్థి పేరు కాలమ్ లో నరేంద్ర మోదీ పేరు రాసి, ఫొటో పేస్ట్ చేయాల్సి ఉన్న ప్రదేశంలో మోదీ ఫొటోనే పెట్టేశాడు. ఈ దరఖాస్తు చూసి షాక్ తిన్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు... వెనువెంటనే దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దరఖాస్తును అప్ లోడ్ చేసిన సైబర్ నేరగాడి కోసం వేట మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News