: ఆల్మట్టికి ఒక్కసారిగా భారీ వరద... 2 లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం
గడచిన 24 గంటల్లో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా నీరు వస్తోంది. ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టికి 2,07,625 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,97,186 క్యూసెక్కల నీటిని వదులుతున్నారు. ఇక నారాయణపూర్ జలాశయానికి 1,90,023 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,93,570 క్యూసెక్కల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ నీటిలో 18 వేల క్యూసెక్కుల వరకూ కుడి, ఎడమ కాలువల ద్వారా పంట పొలాలకు చేరుతుండగా, శ్రీశైలం రిజర్వాయర్ కు 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 10 వేల క్యూసెక్కల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు.