: అప్పు రూ.17 లక్షలు.. వడ్డీ రూ.2.5 కోట్లు.. వెలుగులోకి చెన్నై వడ్డీ వ్యాపారి లీలలు


తమిళనాడులో బయటపడిన ఓ వడ్డీ వ్యాపారి లీలలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరువణ్ణామలైకు చెందిన వేలాయుధం(45) అనే చిన్నపాటి వ్యాపారి అవసరం నిమిత్తం అదే ప్రాంతానికి చెందిన కల్లేరి బాబు(43) నుంచి రూ.రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2013లో వడ్డీ కింద వేలాయుధం నుంచి రూ.1.50 కోట్లు వసూలు చేశాడు. అక్కడితో ఆగక మరో కోటి రూపాయలు వడ్డీ చెల్లించాల్సిందేనంటూ వేలాయుధాన్ని బెదిరించసాగాడు. దీనికి నిరాకరించిన బాధితుడిని వడ్డీ వ్యాపారి బాబు, ఆయన బంధువులు, కారు డ్రైవర్ విగ్నేష్ కలిసి కిడ్నాప్ చేసి ఆయన పేరు మీదున్న 13 ఎకరాల స్థలాన్ని బలవంతంగా రాయించుకున్నారు. దీంతో గతేడాది వేలాయుధం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇప్పటికి స్పందించిన పోలీసులు కల్లేరు బాబు కోసం ఆరా తీయగా అనారోగ్యంతో అతను మృతి చెందినట్టు తెలిసింది. దీంతో అతడి బంధువు నారాయణస్వామి, కారు డ్రైవర్ విగ్నేష్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News