: జీఎస్టీ బిల్లు ఓటింగ్ లో అంతా బటన్ నొక్కి ఓటేస్తే... స్లిప్ పై టిక్ చేసి, ఓటేసిన మోదీ!


లోక్ సభలో నిన్న ఏకగ్రీవంగా ఆమోదం లభించిన జీఎస్టీ బిల్లుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించగా... సభలోని అధికార, విపక్షాల ఎంపీలంతా తమ ముందు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బటన్ ను నొక్కి తమ ఓటు వేశారు. ప్రధాని మోదీ కూడా తన ముందు ఉన్న గ్రీన్ బటన్ ను నొక్కారు. అయితే ఆ బటన్ పనిచేయలేదు. దీంతో సభలోని సభ్యులంతా ఎలక్ట్రానిక్ పధ్ధతిలో ఓటు వేయగా... మోదీ మాత్రం స్లిప్ లో టిక్ చేసి ఓటేశారు.

  • Loading...

More Telugu News