: దేవినేని నెహ్రూ కుటుంబంలో విషాదం!... దేవినేని బాజీ కన్నుమూత!


కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (దేవినేని నెహ్రూ) ఇంట విషాదం నెలకొంది. నెహ్రూకి స్వయానా సోదరుడైన దేవినేని బాజీ నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. సోదరుడు దేవినేని నెహ్రూ టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినా... బాజీ మాత్రం టీడీపీని వీడలేదు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి బాజీ టీడీపీలోనే ఉన్నారు. ఇప్పటికీ విజయవాడ టీడీపీ శాఖలో ఆయన కీలక నేతగానే కొనసాగుతూ వస్తున్నారు. నేటి తెల్లవారుజామున ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో బాజీ తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News