: ‘రియో’ అప్ డేట్స్... ఎయిర్ రైఫిల్, పురుషుల హాకీ విభాగాల్లో భారత్ కు నిరాశ


రియో ఒలింపిక్స్ లో ఎయిర్ రైఫిల్, పురుషుల హాకీ విభాగాల్లో భారత్ కు నిరాశే ఎదురైంది. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచిన అభినవ్ బింద్రా తృటిలో కాంస్యం గెలిచే అవకాశం కోల్పోయాడు. ఎలిమినేషన్ సమయంలో బింద్రా, ఉక్రెయిన్ షూటర్ కులిష్ 163.8 పాయింట్లతో సమానంగా నిలిచారు. తర్వాతి షాట్లలో బింద్రా తన ప్రత్యర్థి కన్నా ఎక్కువ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. ఇటలీ షూటర్ కాంప్రియాని నికోలా స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ రజతం, రష్యా షూటర్ మస్లెన్నికోవ్ కాంస్య పతకం సాధించారు. కాగా, భారత పురుషుల హాకీ జట్టు జర్మనీ చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలైంది.

  • Loading...

More Telugu News