: నయీం అక్రమార్జనకు సంబంధించిన పత్రాలు స్వాధీనం: సైబ‌రాబాద్ ఈస్ట్ పోలీస్‌ క‌మీష‌న‌ర్


రంగారెడ్డి జిల్లా పుప్పాల‌గూడ‌లో న‌యీంకు సంబంధించి చేసిన సోదాల‌పై సైబ‌రాబాద్ ఈస్ట్ పోలీస్‌ క‌మీష‌న‌ర్ న‌వీన్‌చంద్ కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. పోలీసుల చేతిలో హ‌త‌మైన‌ నయీం అక్రమార్జనకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా ప‌క్క‌ రాష్ట్రాల్లోనూ న‌యీంకు సంబంధాలు ఉన్నాయని, న‌యీం మృత‌దేహానికి పోస్ట్ మార్టం చేసిన త‌రువాత ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఆ త‌రువాత ద‌ర్యాప్తు మొద‌లు పెట్టి నివేదిక రూపొందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News