: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చెట్టెక్కి 50 ఏళ్ల మహిళ హల్‌చ‌ల్‌


త‌న‌కు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఓ 50 ఏళ్ల‌ మ‌హిళ చెట్టెక్కి కూర్చొని హ‌ల్‌చ‌ల్ చేసింది. తన కుమారుడిని అన్యాయంగా చంపేశార‌ని, నిందితుల‌ను వెంటనే అదుపులోకి తీసుకొని వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. లేదంటే చెట్టుపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆ మ‌హిళ‌ను బీహార్కు చెందిన బచ్చాదేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్ర‌స్తుతం మహారాష్ట్రలో నివ‌సిస్తోంది. గ‌త ఏడాది అక్టోబర్ లో బీహార్ లో తన కొడుకు హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని బ‌చ్చాదేవి పేర్కొంది. హ‌త్య జ‌రిగి ప‌దినెల‌లు గ‌డిచినా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆమె చెప్పింది. త‌న కొడుకుని చంపిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేస్తోంది. పోలీసుల జోక్యంతో ఆమె ఎట్ట‌కేల‌కు బెట్టుదిగి చెట్టుదిగింది.

  • Loading...

More Telugu News