: షూటింగ్ లో ఫైనల్ కు చేరిన అభినవ్ బింద్రా
అగ్రశ్రేణి షూటర్ అభినవ్ బింద్రా రియో ఒలింపిక్స్ ఫైనల్ కు చేరాడు. 10 మీ.ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత పోటీల్లో 7వ స్థానంలో నిలిచిన అభినవ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సిరీస్ లలో 104.3, 104.4, 105.9, 103.8,102.1,105.2తో మొత్తం 625.7 స్కోరుతో ఫైనల్ కు చేరాడు. ఇటలీ షూటర్ కాంప్రియాని నికోలో 630.2 స్కోరుతో తొలి స్థానంలో నిలిచాడు. కాగా, భారత్ కు చెందిన మరో ఫేవరెట్ షూటర్ గగన్ నారంగ్ ఫైనల్ చేరుకోలేకపోయాడు. తొలి 8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్ చేరుకుంటారు. అయితే, గగన్ నారంగ్ 621.7 స్కోరుతో 23వ స్థానంలో నిలిచాడు.