: ప్రభుత్వ పాలకుల్లో శ్రద్ధ లోపించినప్పుడే ఆ విధంగా జరుగుతుంది: చినజీయర్ స్వామి
ప్రభుత్వ పాలకుల్లో శ్రద్ధ లోపిస్తే నదుల్లో నీళ్లు లోపిస్తాయని చినజీయర్ స్వామి అన్నారు. చదువుకున్న పండితులు రకరకాల భయాలు చూపి ప్రజలను నీళ్ల దగ్గరకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉద్రేకం, ఉద్వేగం రెచ్చగొట్టి పుష్కరాల మొదటి రోజే స్నానం చేయాలని చెప్పడం సరికాదన్నారు. అభివృద్ధి పేరుతో దైవ భావనకు అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఎటు వెళ్లినా దైవ భక్తి కలగకుండా రాజకీయ నాయకుల మొహాలే చూడాల్సి వస్తోందన్నారు. కుంభమేళాలో కోట్లాది మంది స్నానాలు చేస్తారని, ఉత్తర భారతాన్ని చూసి ఇక్కడి ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలని చినజీయర్ స్వామి అన్నారు.