: మందుబాబులను కంట్రోల్ చేసేందుకు ఒక మంచి 'మందు' కోసం ఆలోచిస్తున్నాం: చంద్రబాబు
పట్టపగలే మద్యం సేవిస్తూ పొరుగువారికి ఇబ్బంది కల్గించే మందుబాబులను అదుపులో పెట్టేందుకు ఆలోచిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి వారిని అదుపులో పెట్టేందుకు ఒక మంచి మందు కోసం ఆలోచిస్తున్నామని, త్వరలోనే ఆ 'మందు'ను ఆచరణలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చమత్కరించారు. విచ్చలవిడిగా మద్యం సేవించే వారి వల్ల గ్రామాల్లో ఆడపడచులకు పెద్ద సమస్యగా మారిందని చంద్రబాబు అన్నారు.