: ఒంగోలు ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందంటూ హెచ్చార్సీలో ఫిర్యాదు


ఏపీ కి చెందిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో తనకు ప్రాణహాని ఉందంటూ హెచ్చార్సీలో ఈరోజు ఫిర్యాదు నమోదైంది. ముస్లిం జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ ఈ మేరకు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలపై తాను ఉద్యమించడంతో తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ సెప్టెంబర్ 19 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఒంగోలు ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News