: టీడీఎల్పీ విలీనంపై హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్.. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు
తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్‌లో తెలుగు దేశం పార్టీ శాసనసభా పక్షాన్ని అంతర్థానం చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో టీడీపీ ఎల్పీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌తో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.