: నలుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై వేటు
దేశవాళీ క్రికెట్ మ్యాచుల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ నలుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై వేటు పడింది. అంతర్జాతీయ మాజీ క్రికెటర్ థామి సోలెకైల్పై 12 సంవత్సరాలు, యువ క్రికెటర్లు సీన్ సైమ్స్ పై ఏడు సంవత్సరాలు, ఎథీ ఎంబలాటీ, పుమేలా మ్యాట్షైక్వేలపై పది సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. 2015లో రామ్ స్లామ్ టీ 20 సిరీస్ మ్యాచుల్లో ఈ నలుగురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం తాజాగా వారిపై నిషేధం విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కుంటోన్న మరో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది.