: 'ఒలింపిక్స్'లో సత్తా చాటుతున్న అమెరికా
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న 'ఒలింపిక్స్'లో అమెరికా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 12 పతకాలను సాధించి పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో చైనా, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు నిలిచాయి. చైనా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా మూడేసి స్వర్ణాలు లభించాయి.