: బీచ్‌లో చొక్కా లేకుండానే తిరిగిన కెనడా యువ ప్రధానమంత్రి!


కెనడా యువ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడో బీచ్‌లో చొక్కా లేకుండా తిరిగారు. అంతేగాక‌, ఫోటోకి కూడా పోజిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బీచ్‌లో జ‌రుగుతున్న‌ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఆయ‌న.. వధువును తీసుకెళుతున్న స‌మ‌యంలో అక్క‌డే నిల‌బ‌డి చొక్కా వేసుకోసుకోకుండానే ఫోటో దిగారు. బ్రిటిష్‌ కొలంబియాలోని బీచ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ సాధార‌ణ వ్య‌క్తిలా పెళ్లి వేడుక‌ని ట్రుడో ఆసక్తిగా తిల‌కించార‌ని పెళ్లి ఫొటోలను తీసిన ఫొటోగ్రాఫర్‌ మార్నీ రెకర్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ట్రుడో అనేక ఫీట్లను చేస్తూ త‌రచుగా వార్త‌ల్లో నిలుస్తోన్న విష‌యం విదిత‌మే. ప్ర‌ధాని ఫోటోపై నెటిజన్లు ప‌లు ర‌కాల జోకులు వేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News