: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ‘డెల్టా ఎయిర్ లైన్స్’ విమానాలు
అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థ విమానాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ‘డెల్టా’ కంప్యూటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అమెరికాలోని విమానాశ్రయాలతో పాటు లండన్ లోని విమానాశ్రయంలోనూ ‘డెల్టా’ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, తమ కంపెనీ కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలు ఆగిపోయాయని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ‘డెల్టా’ ప్రతినిధులు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.