: షూటింగ్ జరుగుతుంటే ఒక అమ్మాయొచ్చి ముద్దు పెట్టుకుంది: హీరో సునీల్
ఒకసారి వైజాగ్ లో ఒక చిత్రం షూటింగ్ జరుగుతుంటే ఒక అమ్మాయొచ్చి తనను ముద్దు పెట్టుకుని వెళ్లిపోయిందని హీరో సునీల్ చెప్పాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చేసి నన్ను ముద్దుపెట్టుకోవాలని ఉందని చెప్పింది. ఇదేంటి ఇట్లా అంటోందని నేను అనుకునేలోపే ఆ అమ్మాయి ముద్దు పెట్టేసుకుంది. ఇది నా మిస్టిక్ కాదు. ఆ అమ్మాయి చాలా యంగ్. తెలియనితనంతో ఆ విధంగా చేసింది’ అని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. తనకు వాట్సప్ ద్వారా చాలా ప్రపోజల్స్ వస్తుంటాయని, అట్లాంటప్పుడే, చాలా జాగ్రత్తగా ఆలోచించాలని అన్నాడు. తాను కొత్తగా ఇప్పుడు సినీ ఫీల్డ్ కు వస్తే కనుక తన ప్రయారిటీస్ వేరేగా ఉండేవని, అయితే, ఇప్పుడు తన ప్రాధాన్యతలు వేరని సునీల్ తన మనసులో మాట చెప్పారు.