: ఉపాధ్యాయుల్లో మార్పు రాకపోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి: కడియం
తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో పర్యటిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అద్వానంగా ఉందని తెలుసుకొని అక్కడి సిబ్బందిపై ఆయన మండిపడ్డారు. అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఉపాధ్యాలయులదే కీలక భూమిక అని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని అన్నారు. ప్రజల్లో సర్కారీ బడులపై నమ్మకం పోతోందని అన్నారు. బంగారు తెలంగాణలో ఉపాధ్యాయుల్ని పాలుపంచుకునేలా ప్రజలు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల్లో మార్పు రాకపోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు