: నేపాల్‌లో కూలిన హెలికాఫ్టర్
నేపాల్‌లోని నువాకోట్ సమీపంలో ఈరోజు ఉదయం ఓ హెలికాఫ్టర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. గోర్కా నుంచి కాట్మండు వెళుతుండగా ఈరోజు ఉదయం హెలికాప్టర్ మిస్సయింది. అయితే దీనిపై గాలింపు జరుపుతోన్న అధికారులకు అది నువాకోట్‌లో కూలిపోయినట్లు తెలిసింది. హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు వున్నట్టు వారు తెలిపారు. వారందరూ నేపాల్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు.