: ఏపీ పుష్కర ఆహ్వానంపై నటుడు సంపూర్ణేష్ బాబు సంతోషం


ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం తనను ఆహ్వానించడంపై ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశాడు. కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వానికి తన నమస్సులని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం 'కొబ్బరిమట్ట' చిత్రం షూటింగ్ లో సంపూర్ణేష్ బాబు బిజీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News