: తమిళనాడు గవర్నర్ రోశయ్యకు పుష్కర ఆహ్వానం
ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతోంది. కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా తమిళ నాడు గవర్నర్ రోశయ్యకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం డీఎంకే అధినేత కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్ తో గంటా శ్రీనివాస్ సమావేశమ్యారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ఏపీ ప్రభుత్వం తరపున వారిని ఆయన ఆహ్వానించారు.