: మూడువారాల్లో మూడోసారి.. కుప్వారా జిల్లాలో మరోసారి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు చొరబడకుండా భద్రతాబలగాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి. ఈరోజు ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు ప్రవేశించడంతో భద్రతా బలగాలు వారిపై కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు రెచ్చిపోయి ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు కూడా మృతి చెందారు. కుప్వారాలో ఉగ్రవాదులు ప్రవేశించడానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. మూడు వారాల్లో మూడుసార్లు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మూడువారాల్లో ఏడుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల కాల్పుల్లో హతమయ్యారు.