: ఒలింపిక్స్‌లో అపశ్రుతి.. సైక్లిస్ట్‌కు తీవ్రగాయాలు
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్-16లో మరోసారి అపశ్రుతి జరిగింది. నిన్న 2013 యూరోపియన్ ఛాంపియన్, ఫ్రెంచ్ జిమ్నాస్ట్ సమీర్ ఐత్ సయీద్ మోకాలి కింది ఎముక విరిగి ఆయన పోటీలనుంచి తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా అటువంటి ప్రమాదానికే నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా సైక్లిస్ట్ గురయింది. రేసులో పాల్గొంటున్న సైక్లిస్ట్ అనెమీక్ వాన్ (33) రేసు పూర్తి చేయడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా కింద పడింది. దీంతో వెన్నుపూస మూడు చోట్ల విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మలుపులో సైకిల్‌ను టర్న్ తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా అది అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.