: సొంత ఇలాకా చేరిన చంద్రబాబు!... కుప్పం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నేటి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన నేరుగా కుప్పం చేరుకున్నారు. అనంతరం కుప్పం ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు... అక్కడ మొక్కలు నాటారు. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి అయ్యారు. కుప్పంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన జరపనున్న ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.