: తెలుగు ప్రాచీన భాషే... సందేహం లేదన్న మద్రాస్ హైకోర్టు
తెలుగు భాష ప్రాచీన భాషే అనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తీర్పునిస్తూ, తెలుగుకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించిన మీదట, నిబంధనల ప్రకారమే హోదా దక్కిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ, దాన్ని రద్దు చేయాలని పిటిషన్ వేయగా, విచారించిన అనంతరం కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది.