: మా తాతగారి ఆశయాలను నెరవేరుస్తా!... చిన్నారులకు బంగరు భవితే ఎన్టీఆర్ ట్రస్టు లక్ష్యం!: నారా లోకేశ్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న కీలక ప్రకటన చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, తన తాత నందమూరి తారకరామారావు ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా తాను పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నిన్న హైదరాబాదులోని ఐటీసీ కాకతీయ హోటల్ లో ప్రముఖ చిత్రకారుడు హరి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను తప్పనిసరిగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న మోడల్ స్కూళ్లలో అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మోడల్ స్కూళ్ల సంఖ్యను మరింతగా పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News