: కాల్పులతో దద్దరిల్లుతున్న షాద్ నగర్!
షాద్ నగర్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న అనుమానంతో, పోలీసులు చుట్టుముట్టిన వేళ, ఆ ఇంటి నుంచి కాల్పులు రావడంతో, పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత మంది ఉగ్రవాదులు ఆ ఇంట్లో నక్కి ఉన్నారన్న విషయమై సమాచారం లేనప్పటికీ, ఓ ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. బాషా అనే వ్యక్తికి చెందిన ఇంట్లో వీరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎన్ఐఏతో పాటు గ్రేహౌండ్స్, పారామిలటరీ బలగాలు సైతం హుటాహుటిన షాద్ నగర్ కు తరలివెళ్లాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.