: రియోలో పెను సంచలనం... తొలి రౌండ్ లోనే ఓడిన జకోవిచ్
రియో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా జరుగుతున్న టెన్నిస్ పోరులో పెను సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు, స్వర్ణ పతకం సాధిస్తాడన్న అంచనాలతో బరిలోకి దిగిన నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా తొలి రౌండులోనే ఓడిపోయాడు. డెల్ పాట్రోతో ఆడిన జకోవిచ్ 7-6, 7-6 తేడాతో ఓడిపోయాడు. ఈ ఓటమితో తాను చాలా బాధపడుతున్నానని, డెల్ పాట్రోను తక్కువగా అంచనా వేయడమే తన ఓటమికి కారణమని, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నానని అన్నాడు. కాగా, రియోకు వచ్చిన పలువురు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులంతా ఇంటిదారి పడుతున్న సంగతి తెలిసిందే.