: 'నేను ముఖ్యమంత్రిగా...' నోరు జారిన నరేంద్ర మోదీ!


నిన్న గజ్వేల్ కు వచ్చి కోమటిబండలో మిషన్ భగీరథ ఫలాలను ప్రజలకు అందించిన తరువాత, జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో రెండు తప్పులు దొర్లాయి. తమ రాష్ట్రాల్లో పంట పొలాల కోసం ఎరువులు కావాలని రాష్ట్రాలు ఏకరువు పెడుతుండటాన్ని ప్రస్తావించిన సందర్భంలో మోదీ "నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.." అనే బదులు "నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి..." అన్నారు. ఆపై ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన నెల రోజులకు హైదరాబాద్ కు విముక్తి కలిగిందని అన్నారు. వాస్తవానికి ఆగస్టు 15, 1947న స్వతంత్ర భారతావని ఉద్భవించిన 13 నెలలకు సెప్టెంబర్ 17, 1948లో ఆనాటి భారత సైన్యం నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News