: బాలీవుడ్‌లో అందరూ నా స్నేహితులే.. సంజు, షారూఖ్, ఆమిర్, కత్రినాకైఫ్ మాత్రం ‘క్లోజ్’ ఫ్రెండ్స్: సల్లు భాయ్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు బాలీవుడ్‌లో అందరూ స్నేహితులేనని, కాకపోతే సంజయ్‌దత్, షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్ మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నాడు. ‘‘ఇండస్ట్రీలో నాకు చాలామంది ఆడ, మగ స్నేహితులున్నారు. పక్షులు, జంతువులు కూడా నా స్నేహితులే. ఎవరి పేరని చెప్పగలను? ఇండ్రస్ట్రీ మొత్తం నా స్నేహితులే’’ అని పేర్కొన్నాడు. ముంబైలో తన సోదరుడు సోహైల్ ఖాన్ రాబోయే చిత్రం ‘ఫ్రీకీ అలీ’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ విలేకరులతో మాట్లాడాడు. ఫ్రెండ్స్ ఎందరున్నా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కొందరే ఉంటారని చెప్పుకొచ్చాడు. సంజు(సంజయ్ దత్)ను తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్న ఈ 50 ఏళ్ల బ్యాచిలర్.. షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తనకు చాలా దగ్గరి స్నేహితులని పేర్కొన్నాడు. ‘‘ఈ పేర్లు విని మీకు బోర్ కొట్టొచ్చు. కొంతమంది అమ్మాయిల పేర్లు కూడా చెబుతాను. కత్రినా కైఫ్ కూడా నా స్నేహితురాలే’’ అంటూ నవ్వులు పూయించాడు. తన సోదరుడి ‘ఫ్రీకీ అలీ’ సినిమాతో పాటు కత్రినా నటించిన ‘బార్ బార్ దేఖో’ కూడా విడుదల అవుతోందని, కాబట్టి ఇప్పుడు తనవి రెండు దారులంటూ చమత్కరించాడు.

  • Loading...

More Telugu News