: కాశ్మీర్ విముక్తికి ఇండియాతో అణుయుద్ధమే...!: హిజ్బుల్ నేత సలావుద్దీన్


కాశ్మీర్ కోసం ఇండియాతో అణుయుద్ధం తప్పదని, కాశ్మీరీలు సైతం తమ చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడాలని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ అంటున్నాడు. కాశ్మీరీల పోరాటానికి అండగా నిలవాల్సిన బాధ్యత పాకిస్థాన్ దేనని, పాక్ నిలబడితే రెండు దేశాల మధ్యా అణుయుద్ధం జరిగి, అదే ప్రపంచ యుద్ధం అవుతుందని అన్నాడు. కాశ్మీర్ లోని ప్రజలు అక్కడ రాజీపడి బతకడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్యానిస్తూ, పాక్ మద్దతివ్వకున్నా, ఐరాస తోడుగా రాకున్నా, ఆయుధాలు ధరించి యుద్ధం చేయడమే తమ విముక్తికి మార్గమన్న నిర్ణయంలో ప్రజలు ఉన్నారని అన్నాడు. ఇండియా నుంచి విముక్తి కలుగకుంటే, ప్రజలు సాయుధ తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని, ఆపై భారత్ తగిన మూల్యం చెల్లించుకునే తీరుతుందని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News