: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు


నల్గొండ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండా వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వేగంగా వచ్చిన కృష్టా ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News