: ముందస్తు ప్లాన్లు వద్దు.. సింపుల్‌గా, స్పాంటేనియస్‌గా దాడులకు తెగబడండి: ఉగ్రవాదులకు ఐసిస్ పిలుపు


ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) దాడులపై తన వ్యూహాన్ని మార్చినట్టు కనబడుతోంది. ముందస్తు ప్లాన్లు లేకుండా సింపుల్‌గా అప్పటికప్పుడు దాడులకు తెగబడేలా ఉగ్రవాదులకు నూరిపోస్తోంది. ఈ మేరకు తన మ్యాగజైన్ ‘డెబిక్’ ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఉగ్రవాదిగా మారిన ఓ అమెరికన్ ముస్లిం ఈ ఆర్టికల్‌ ను రాస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐసిస్ సానుభూతిపరులకు పలు సూచనలు చేశాడు. ‘‘దాడుల కోసం ఎటువంటి ముందస్తు ప్లాన్లు వద్దు. సింపుల్‌గా ఉండాలి, అంత్యంత భయంకరంగా ఉండేలా దాడులకు తెగబడండి. మీ దగ్గర ఆయుధముంటే క్షణం ఆలస్యం చేయకుండా దానిని ఉపయోగించండి. దాడులతో ఆ ప్రాంతంలో విపరీతమైన ప్రాణనష్టం జరిగేలా చూసుకోండి. దాడి చాలా భయంకరంగా ఉండాలి’’ అని ఆర్టికల్‌లో పేర్కొన్నాడు. మధ్యప్రాచ్య దేశాలకు రావడంలో ఇబ్బందులు ఎదురైతే ఇంటి నుంచే దాడులకు తెగబడాలంటూ సూచించాడు. ఐసిస్ తాజా వ్యూహంతో బ్రిటన్ అప్రమత్తమైంది. ముఖ్యమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. భద్రతను మరింత పటిష్టం చేసింది. దాదాపు 600 మంది సాయుధ పోలీసులను రంగంలోకి దింపింది.

  • Loading...

More Telugu News