: పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న క్రిష్.. ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుగుతున్న క్రిష్ వివాహం
ప్రముఖుల సమక్షంలో సినీ దర్శకుడు క్రిష్ వివాహం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఎంతోమంది అతిరథ మహారథులు హాజరవుతున్నారు. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ క్రిష్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. క్రిష్-రమ్యల వివాహ వేదిక వద్దకు తెలుగు సినీనటులు అల్లు అర్జున్, అక్కినేని నాగచైతన్య, తణికెళ్ల భరణి ఇప్పటికే చేరుకున్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఆయన పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.